rapaka 330x242 1

జనసేన కథ ముగిసినట్లే(నా)

POLATICAL సినిమా

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మూడో పార్టీగా అవతరించిన జనసేన మనుగడ కష్టంగా మారింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానంలో మాత్రమే పార్టీ అభ్యర్థి (రాజోలు – రాపాక వరప్రసాదరావు) విజయం సాధించారు. పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు అయితే పవన్‌ కల్యాణ్‌ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల రాజోలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘నేను పేరుకి మాత్రమే జనసేన ఎమ్మెల్యే. నేను వైకాపా కోసమే పనిచేస్తున్నారు. నేను నెగ్గిన పార్టీ నిలబడేది కాదు. ఉంటుందో లేదో కూడా తెలియదు. బయటి కులాల మద్ధతుతో గెలిచాను. మిగతా చోట్లా ఎక్కడా గెలవలేదు. వ్యక్తిని బట్టి పార్టీపై ఇష్టం లేకపోయినా తనకు అందరూ మద్దతు ఇచ్చారు. వైసీపీలో వర్గాలు ఉండొచ్చు. అధినేత ఒక మాట చెబితే గొడవలు ఉండవు. ఇప్పటికే ఇద్దరు నేతలు ఉన్నారు.. అందరినీ కలుపుకుని వెళ్తా’ అన్నారు. దీంతో జనసేన మనుగడ కష్టమే అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ కూడా సినీరంగంపై దృష్టి పెట్టారు.