IMG 20200816 WA0004

బిగ్ బాస్- 4 ప్రోమో వచ్చిందోచ్….!

సినిమా FILM NEWS

బిగ్ బాస్- 4 ప్రోమో వచ్చిందోచ్
*మళ్ళీ నాగార్జునే హోస్ట్
*50రోజులకే పరిమితం కానున్న 4వ సీజన్

బెంగళూరు, ఆగస్టు 16:తెలుగు టీవీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న బిగ్ బాస్- 4 టీజర్ తానే వచ్చింది. 3వ సీజన్ లో హోస్ట్ గా అలరించిన కింగ్ నాగార్జున 4వ సీజన్ కు కూడా రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమయ్యారు. శనివారం విడుదల చేసిన టీజర్ లో నాగార్జున మూడు పాత్రల్లో కనిపించి 4వ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచారు.

IMG 20200816 WA0005
ఫిక్స్ కాని డేట్స్:
సీజన్ 4 ఇప్పటి నుంచి ప్రసారం కానుందో ఇంకా స్పష్టత రాలేదు. సెప్టెంబర్ నుంచి ప్రసారం అవుతుందని రూమర్స్ వినిపిస్తున్నా మా టీవీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ సారి సీజన్ గతంలో మాదిరి 100రోజులు కాకుండా 50రోజులకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. కోవిడ్-19 కారణంగా బిగ్ బాస్ హౌస్ లో నిబంధనలు మరింత కఠినంగా అమలు కానున్నాయి. ఎమోషన్స్ కు అవకాశం ఇస్తూనే పోటీదారులు భౌతికదూరం పాటించే స్కిట్స్ రూపొందించారని సమాచారం. సీజన్- 1కు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, సీజన్ -2కు నేచురల్ హీరో నాని హోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. 3వ సీజన్ కు యాంకరింగ్ చేసిన నాగార్జున మళ్ళీ 4వ సీజన్ కు హోస్టుగా వ్యవహరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం కరోనా భయంతో ఇంట్లోనే మగ్గే వాళ్లంతా రిమోట్లతో రెడీ అవ్వండి.