– జెండా ఎగురవేసిన డ్రైవర్లు
– డ్రిల్ చేసిన భద్రతా సిబ్బంది
సాక్షి బెంగళూరు: స్వాతంత్య్ర వేడుకలు అంటే.. పరేడ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆలపించడం.. తదితర ఏర్పాట్లు ఆనవాయితీగా వస్తున్నాయి అయితే బెంగళూరు నగర శివారున యలహంకలోని విశ్వవిద్యాపీఠంలో 74వ స్వాతంత్య్ర దిన వేడుకలను ఈసారి ప్రత్యేకంగా నిర్వహించారు. సమాజ సేవలో భాగమైన డ్రైవర్లు, భద్రతా సిబ్బంది, సహాయకులను గౌరవిస్తూ.. జెండా వందనం పూర్తి చేశారు. వేడుకల్లో భాగంగా డ్రైవర్లు జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో భద్రతా సిబ్బంది డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన గోసేవ ఆయోగ మాజీ సభ్యుడు, అఖిల కర్ణాటక ప్రాణిదయాద వ్యవస్థాపకుడు ఉత్తమ్‌చంద్‌జైన్ మాట్లాడుతూ పశు సంరక్షణలో ప్రముఖ పాత్ర వహించిన వారిని సత్కరించడం తమ వంతు బాధ్యత అన్నారు. ఈనేపథ్యంలో డ్రైవర్లు, సిబ్బంది, సహాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాపీఠం డైరెక్టర్ సుశిలా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.