సినిమాకుసింగిల్విండోవిధానం- దేశమంతాసినిమాలచిత్రీకరణకుఒకేవిధానం? – ప్రాంతీయ జీఎస్టీ అమలకు కేంద్రం కసరత్తు- ఆంధ్రాలోనే తొలి అడుగు
బెంగళూరు మే 24: మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిసి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను తిరిగి ప్రారంభించడానికి అనుమతి కోరారు. సానుకూల స్పందనను సిఎం కెసిఆర్ వ్యక్తం చేశారు. టాలీవుడ్ తారలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలవడానికి సిద్ధంగా ఉన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలవడానికి స్టార్స్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రీకరణను రాష్ట్రంలో సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక జీవోను జారీ చేసింది.
చిరంజీవి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వైయస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతుంది. చిత్ర పరిశ్రమలో ప్రస్తుత సమస్యలపై చర్చించనుంది.
సింగిల్ విండో వ్యవస్థను జీవో విడుదల చేసినందుకు మరియు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి త్వరలో కలిస ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతామాని ”అని చిరంజీవి ట్వీట్ చేశారు. లాక్ డౌన్ తర్వాత చిత్రసీమ ప్రముఖులతో భేటీ చేసేందుకు సీఎం వైస్ జగన్ సముఖత వ్యక్తం చేసినట్లు చిరంజీవి ట్విట్టర్లో తెలిపారు.
- సింగిల్ విండో వల్ల ఏం లాభం:
ప్రస్తుతం చిత్రీకరణకు సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ధర ఉంటుంది. ప్రధాన నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో చిత్రీకరణ వ్యయాల్లో వ్యత్యాసం ఉంటుంది. వినోదం పన్నులు, జీఎస్టీ పన్నులు, థియేటర్, కాపీ రైట్స్ కూడా ఏరియాల వారీగా మారుతుంటాయి.. కొత్త జీవో వల్ల ఈ వ్యత్యాసం ఉండక రాష్ట్రమంతా ఒకే విధానం అమలవుతుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒకే విధానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి.
- దేశమంతా కూడా?
ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా తెలుగు చలన చిత్ర ప్రముఖులతో వీడియో సమావేశంలో మాట్లాడారు. దేశమంతా ఒకేరోజు థియేటర్లు తెరిచే ఏర్పాటు చేస్తామన్నారు. చిత్ర పరిశ్రమకు క్యాప్టివ్ పవర్తో పాటు ప్రాంతీయ జీఎస్టీ అమలయ్యేలా చేస్తామన్నారు. ఏ రాష్ట్రంలోనైనా షూటింగ్, స్టూడియోల నిర్మాణానికి వీలుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానన్నారు. ఇదే సింగిల్ విండో(ఏక గవాక్ష విధానం) అమలైతే టికెట్ ధరలు నేలకు దిగినట్లే.