కోట్లకు పడగలెత్తిన అల్లు అర్జున్
*’పుష్ప’ కు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్
*కరోనా కష్టాల నేపథ్యంలో కాస్త తగ్గాలని నిర్మాతల మనవి
బెంగుళూరు, జూన్ 23:తన సొంత బ్యానర్ పై తీసిన ‘అల వైకుంఠపురంలో’ తో రూ. 200కోట్ల విజయాన్ని సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం *పుష్ప’ కు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల భోగట్టా. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన సినిమాలకు రూ. 14కోట్ల నుంచి రూ. 17కోట్ల మేర సంభావన అందుకున్నారు. కానీ తాను తాజాగా చేసిన మ్యూజికల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అల వైకుంఠపురంలో’ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలవటంతో ప్రస్తుతం షూటింగ్ కు సిద్ధంగా ఉన్న *పుష్ప’ మూవీకి రెట్టింపు సంభావన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం
రూ. 35కోట్ల డిమాండ్:
తనకు స్టార్ హీరో స్టేటస్ అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ‘పుష్ప ‘కు రూ.35కోట్లు అల్లు అర్జున్ అడిగినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ గత ఏప్రిల్ లోనే ప్రారంభం కావాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతితో మళ్ళీ మొదలైన షూటింగుల హంగామాలో అల్లు అర్జున్ ‘పుష్ప’ కూడా త్వరలో సందడి చేయనుంది. కానీ కరోనా దెబ్బతో నిర్మాణ రంగం కుదేలవటంతో పుష్ప టీమ్ కూడా సంభావన తగ్గించుకోవాలని అల్లు అర్జున్ తో మనవి చేసుకుంది. ఈ విషయం పై అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది. తన సొంత బ్యానర్ మూవీకే రూ.25కోట్లు ఖాతాలో వేసుకునే అల్లు అర్జున్ పొరుగు నిర్మాతలతో ఈమేరకు రాజీ పడతారన్నది కోటి డాలర్ల ప్రశ్న.
ప్యాన్ ఇండియా క్రేజ్: ‘రంగస్థలం’ వంటి మెగా హిట్ తర్వాత సుకుమార్, ‘అల వైకుంఠపురంలో’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ లు నటిస్తున్న ఈ చిత్రానికి ప్యాన్ ఇండియా క్రేజ్ రావటంతో భారీ తారాగణంతోనే నిర్మించేందుకు మైత్రీ మూవీస్ కసరత్తు ప్రారంభించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నిర్మితం అవనున్న ‘పుష్ప’లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా సక్సెస్ ఫుల్ తార రష్మిక మందన్న జోడీగా నటిస్తోంది. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, తమిళ సెన్సేషన్ విజయ్ సేతుపతిలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు