images 1

చండమారుతానికి వర్షం తోడు…!

జనరల్

*మే 30 వరకు రాష్ట్రంలో వర్ష సూచన
*కరోనా సెగ నుంచి చల్లబడిన బెంగళూరు

బెంగళూరు, మే 24:ఈనెల 28 వరకు దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా లోని పలు ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతాయని వాతావరణ శాఖ శనివారమే హెచ్చరించింది. కర్ణాటకలోని ప్రాంతీయ కేంద్రం సంచాలకులు కులదీప్ శ్రీవత్సవ కూడా దక్షిణ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఆదివారం మధ్యాహ్నం నాటికి పరిస్థితి తిరగబడింది. బెంగళూరులో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలుకరించాయి.
పెరుగుతుంది అనుకుంటే తగ్గింది:
సాధారణంగా వాతావరణ శాఖ వర్షాలు, తుఫాను సందర్బంగానే హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ ఈసారి వేసవిలో 40డిగ్రీ సెల్సీయస్ కంటే ఎక్కువ లేదా సాధారణం కంటే 5డిగ్రీల సెల్సీయస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి..జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. కానీ బెంగళూరులో శనివారం 36డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదివారం ఈ ఉష్ణోగ్రత 4డిగ్రీ లకు తగ్గింది. బెంగళూరులో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డట్లు బీబీఎంపీ పేర్కొంది.
ఈనెల 30వరకు ప్రభావం:
ఆదివారం మధ్య కర్ణాటకలో గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కానీ ఈనెల 26, 27 తేదీల్లో మండ్య, చిక్కమగళూరు, హాసన, కొడగు, శివమొగ్గ, మైసూరుల్లో గాలులతో కూడిన వర్షాలు పడతాయని కర్ణాటక ప్రకృతి వైపరీత్యా నిర్వహణ శాఖ హెచ్చరించింది. అసలే కరోనా తో వణుకుతున్న కర్ణాటకకు వర్షాలు కాస్త ఊరట కలిగించా