images 10

అడుగడుగునా ఆరోగ్యమంత్రి నిర్లక్ష్యం…!

జనరల్

అడుగడుగునా ఆరోగ్యమంత్రి నిర్లక్ష్యం:
*లాక్ డౌన్ నిబంధనలు గాలికి
*నిబంధనలు పెద్దలకు వర్తించవా?

బెంగుళూరు, జూన్ 15:ప్రస్తుత కొరోనా విపత్కర పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిని దారికి తెచ్చే శాఖల్లో ఆరోగ్య శాఖ ఒకటి. కానీ అదే శాఖని నిర్వర్తించే మంత్రే నిబంధలను గాలికి వదిలేస్తే.. ఎవరికి మొరపెట్టేది? ఆరోగ్యమంత్రి బి శ్రీరాములు యథేచ్ఛగా కొవిడ్ నియంత్రణ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. బహిరంగ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటు, నిర్లక్ష్యంగా వ్యవరించి వార్తల్లో నిలుస్తున్నారు.

మొన్న చిత్రదుర్గ.. తాజాగా బళ్లారి:

ఇదే నెల 3న చిత్రదుర్గ జిల్లా పరశురామ్ పురలో నది నీటి మళ్లింపు కార్యక్రమంలో ఆరోగ్యమంత్రి బి శ్రీరాములు పాల్గొన్నారు
ఈ సందర్బంగా అయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సదరు మంత్రిని ర్యాలీ ద్వారా స్వాగతించారు. భారీ పళ్ళ మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వేలాది అభిమానులు పాల్గొన్నారు. వీరిలో అత్యధికులు మాస్కులు ధరించక పోవటం, భౌతిక దూరాన్ని అసలే పాటించకపోవడం చర్చకు దారి తీసింది. సోమవారం కూడా బళ్లారి జిల్లా లక్ష్మిపురలో మాజీ మంత్రి పీటీ పరమేశ్వర నాయక్ కుమారుడి వివాహానికి మంత్రి శ్రీరాములు హాజరయ్యారు. ఇదే వివాహానికి విపక్ష నేత సిద్దరామయ్య, కాంగ్రెస్ మాజీ డీసీఎం జి పరమేశ్వర తదితరులు హాజరయ్యారు. ఈ వివాహానికి దాదాపు 800పైగా హాజరు అవటం చర్చకు తావిచ్చింది. ప్రముఖులతో పాటు అతిధులు, గ్రామస్తులు ఎవ్వరూ మాస్కులు ధరించకపోవటం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర నిబంధనల మేరకు కేవలం 50మంది తోనే వివాహ శుభకార్యాలు నిర్వహించాలి. ర్యాలీలు పూర్తిగా నిషేధం..కానీ ఈ నియమాలు పర్యవేక్షించాల్సిన కీలక శాఖ మంత్రి ఇలా నిర్లక్యంగా వ్యవహరిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి?