120820kpn88

అక్కడ 15 వరకు 144 సెక్షన్‌

జనరల్

– ఘటనపై ఆరు కోణాల్లో తనిఖీ

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని డీజే హళ్లి, కేజీ హళ్లిలో మంగళవారం రాత్రి జరిగిన హింసకాండకు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఈ¯ ల 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ తెలిపారు. అదేవిధంగా అల్లర్లకు ప్రధాన కారకుడైన పులకేశినగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌కు చెందిన ఫేస్‌బుక్‌ నుంచి మరో పోస్టు షేర్‌ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు 15 గంటల ముందు బీజేపీ ఎమ్మెల్యే మురుగేశ్‌ నిరాణి (భాగల్‌కోటె జిల్లా బిలగి నియోజకవర్గం) హిందూ సంప్రదాయానికి సంబంధించిన వాట్సాప్‌ పోస్టు చేయగా.. దాన్ని నవీన్‌ టైమ్‌లైన్‌లో షేర్‌ చేశారు. అయితే రెండు రోజులు ముందుగానే తన మొబైల్‌ పోగొట్టుకుపోయిందని ఫిర్యాదు చేసినట్లు నవీన్‌ తెలిపాడు. అంతేకాకుండా తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని కూడా పేర్కొన్నాడు.

ఆరు కోణాల్లో తనిఖీ
ఫేస్‌బుక్‌ పోస్టుతో రాజుకున్న చిచ్చుకు సంబంధించి ఏ–1 నిందితుడుగా ఎస్‌డీపీఐ నేత ముజామిల్‌పాషాను ఇప్పటికే అరెస్టు చేశారు. ఘటనలో శివాజీనగర, గోరిపాళ్య, చామరాజపేటె ప్రాంతాల నుంచి ఆందోళనకారులు వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే వాట్సాప్‌ ఆధారంగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే అల్లర్లు సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఆరు కోణాల్లో తనికీ ఆరంభించారు. సీసీటీవీ దృశ్యాలు, నిందితులుగా ఉన్న వారి ఫోన్‌ల నుంచి మెసేజిలు ఎవరికి పంపించారు? ఎవరికి పంపించారు? ఘటనకు ముందే ఏదైనా సమావేశం నిర్వహించారా? నవీన్‌ కుటుంబ సభ్యులను విచారణ చేయడం? పోలీసు వాహనాలకు నిప్పు పెట్టిన సమయంలో మారణాయుధాలు వినియోగించారా? అనే కోణాల్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు.