images 9

ఏపీ నుంచి కర్ణాటకకు రైట్ రైట్…!

జనరల్

ఏపీ నుంచి కర్ణాటకకు రైట్ రైట్
*17నుంచి బస్సు సేవలు ప్రారంభం
*5దశల్లో 500బస్సులు

బెంగుళూరు, జూన్ 15:లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య స్తంభించిన బస్సు సేవలు పునః ప్రారంభం కానున్నాయి. ఈనెల 17నుంచి కర్ణాటక, కడప, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, అనంతపురంలోని ప్రధాన నగరాలకు బస్సులు నడపనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో బెంగుళూరు, బళ్లారిలకు నాన్ స్టాప్ బస్సులు తిరుగుతాయి. క్రమంగా ఏపీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రధాన పట్టణాలకు బస్సులు ప్రారంభం అవుతాయి.
తొలుత 168..ఆపై 500:
దశల వారీగా బస్సుల సంఖ్యను పెంచుతారు. ఈనెల 17న తొలి దశలో భాగంగా 168 బస్సులు, ఆపై దశల్లో 500 వరకు బస్సుల సంఖ్య పెంచుతారు. నేటి(సోమవారం)నుంచే ఆన్ లైన్, బస్టాండుల్లో బుక్కింగ్ సేవలు మొదలయ్యాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు, వాటి నివేదికలపై ఇరు రాష్ట్రాలు నిఘా ఉంచుతాయి. త్వరలో తెలంగాణ మధ్య కూడా బస్సు సేవలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది