77b6cacd 8bda 44f1 bbf9 652c0f8776ae

రైతుకు ముఖ్యమంత్రి వరాల జల్లు..

జనరల్

లాక్ డౌన్ కారణంగా తల్లడిల్లుతున్న రైతు  సముదాయాన్ని  ఆదుకునేందుకు ముఖ్యమంత్రి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రూ.1,610కోట్ల ఆర్థిక ప్యాకేజీ లో భాగంగా పూలు, కూరగాయల పంటలకు హెక్టారుకు రూ.25వేలు పరిహారంగా ప్రకటించారు. తాజాగా వ్యవసాయ పంటల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేసున్నట్లు సీఎం యడి యూరప్ప ట్వీట్ చేశారు. ఈ మాఫీ సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే చేస్తారు. 2019 ఏప్రిల్ నుంచి తీసుకున్న రుణాలకు కూడా వడ్డీ వసూలు చేయరు.

download 1 6

విద్యార్థుల పథకాలకు కోత లేదు:

విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేసే ఉచిత సైకిల్ వంటి పథకాలకు కోత ఉండబోదని ముఖ్యమంత్రి ప్రకటించారు. తన అధికార నివాసం కృష్ణలో శుక్రవారం ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్ధిక సమస్యలున్నా విద్యకు సంబంధించిన పథకాలకు ఢోకా రనివ్వమని సీఎం హామీ ఇచ్చారు. జూన్ 25నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు సదరు శాఖ తీసుకునే చర్యలపై పర్యవేక్షించారు. కరోనా నియంత్రణ చర్యల్లో రాజీపడవద్దని సూచించారు. ఇప్పటికే ప్రకటించినట్లు ఒక్కో పరీక్ష గదిలో 25 విద్యార్థులకు బదులు 18నుంచి 20మందినే కూర్చోబెట్టాలన్నారు. గైడ్స్ అండ్ స్కౌట్స్ బృందాల సహకారంతో ప్యూమిగేషన్, స్యానిటైజేషన్ చర్యలు చేపట్టాలన్నారు. దూరదర్శన్ ద్వారా పాఠాల పై అవగాహన తరగతులు, యూట్యూబ్ ద్వారా ప్రాధమిక విద్యార్థుల కోసం ప్రసారం చేసే కార్యక్రమాలను మరింత ఉన్నతీకరించాలని సూచించారు. ఇప్పటికే 45లక్షల మంది ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నట్లు అధికారులు సీఎం కు వివరించారు. క్వారెంటైన్ వలయాల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. కానీ మొరార్జీ దేశాయ్, సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ వసతి నిలయాల విద్యార్థులకు వారుండే ప్రాంతాల్లోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణ ఖర్చులు భరిస్తాం:

ఈనెల 31న కర్ణాటక నుంచి సొంత గూటికి వెళ్లే వలస కూలీల ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వీరంతా మా రాష్ట్ర వాసులు గానే భావిస్తూ ఆదుకుంటామన్నారు. ఇక రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలసదారుల వల్ల కరోనా కేసులు పెరుగుతుండగా..దొంగచాటుగా రాష్ట్రంలో ప్రవేశించే వారిపై నిఘా పెంచాలని సీఎం ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారి వల్ల కేసులు పెరుగుతున్న మండ్య, చిక్కబళ్లాపుర జిల్లాధికారులతో ఆయన శుక్రవారం వీడియో సమావేశంలో పాల్గొన్నారు