download 1

కొరొనా ఫస్ట్ వ్యాక్సిన్ రష్యాది కాదు….!

జనరల్

కొరొనా ఫస్ట్ వ్యాక్సిన్ రష్యాది కాదు: కిరణ్ మజుందార్ షా
*రెండు క్లినికేల్ ట్రయల్స్ డేటా విడుదల చేయని రష్యా
బెంగళూరు, ఆగస్టు 15:గత మంగళవారం ప్రపంచంలోనే తొలి కొరొనా వ్యాక్సిన్ తయారు చేసింది మేమేనని రష్యా ప్రకటించుకోవటం పై బెంగళూరు బయో టెక్నాలజీ దిగ్గజం కిరణ్ మజుందార్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిఐ తో మాట్లాడిన ఆమె మాస్కోకు చెందిన గంలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొరొనా వ్యాక్సిన్ అడ్వాన్స్డ్ ప్రోగ్రాం తాలూకు తొలి రెండు క్లినికల్ ట్రయల్స్ డేటా ప్రపంచానికి అందుబాటులో లేదన్నారు. వాటి డేటా బహిరంగ పరిస్తేనే ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ గా పరిగణిస్తారు మజుందార్ సూచించారు. ఒకవేళ మూడవ ట్రయల్స్ డేటా అయినా బహిరంగ పరిస్తే అది ప్రపంచానికి మేలు చేసినట్లేనన్నారు. ఇప్పటికే చాలా సంస్థలు ఈ వ్యాక్సిన్ తయారీలో అడ్వాన్స్డ్ స్టేజీలో ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు