IMG 20200815 WA0074

Modi: స్వదేశీ, ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యం-

జనరల్

స్వదేశీ, ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యం-ఎర్రకోట వేదికపై ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
*అందరికి హెల్త్ కార్డులు
బెంగళూరు, ఆగస్టు 15:భారత దేశం శాస్త్ర సాంకేతిక, రక్షణ, వైద్య రంగాల్లో స్వదేశీ విజ్ఞానాన్ని సద్వినియోగ పరుచుకుంటోంది. రానున్న రోజుల్లో స్వదేశీ మంత్రం మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓకల్ ఫర్ లోకల్ మరింత ఇనుమడించాలని ఆయన సూచించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శనివారం దిల్లీలోని ఎర్రకోట వద్ద దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొరోనా వేళ దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను స్వదేశీ విజ్ఞానంతో ఎదుర్కోవలన్నారు. కొరోనా తొలినాళ్లలో పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులను దిగుమతి చేసుకున్న భారత్ నేడు స్వదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చిందని గుర్తు చేశారు. ఆత్మ నిర్భర్ ద్వారా దేశం ఆర్ధిక స్వావలంబన సాధించిందన్నారు. ఎఫ్ డి ఐలో 18శాతం వృద్ధి, వ్యవసాయ, మౌలిక, నీటి పారుదల, వైద్య రంగాల్లో భారత్ కొత్తపుంతలు తొక్కనుందని విశ్లేషించారు.

IMG 20200815 WA0073
అందరికీ ఆరోగ్య కార్డులు:
ఈ సందర్భంగా ప్రధాని నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రారంభించారు. ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డులు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని పొందు పరచిన ఈ కార్డు వ్యక్తిగత గోప్యాన్ని పాటిస్తూ, డిజిటల్ సాంకేతికతో వైద్య సేవలు అందించగలదన్నారు. దేశంలో కొరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందరికీ కొరోనా టీకాలు వేసే వ్యవస్థ సిద్ధమవనుందని ప్రధాని చెప్పారు