*దిల్లీ నుంచి బెంగళూరుకు ఒంటరిగా వచ్చిన 5ఏళ్ల పిడుగు
బెంగళూరు, మే 25: విమానాల్లో తరచూ ప్రయాణిస్తున్నా ప్రతి సారీ జంకే వాళ్ళను చూస్తుంటాం. కానీ ఎవ్వరూ తోడు లేకుండా ఒక్కడే దిల్లీ నుంచి బెంగళూరు కు వచ్చిన 5ఏళ్ల పిడుగును చూసి తోటి ప్రయాణీకులంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే. సోమవారం ఉదయం 11:46 నిమిషాలకు దిల్లీ నుంచి కేంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ విమానం ల్యాండ్ అయ్యింది. అరైవల్స్ ద్వారం నుంచి 5ఏళ్ల చిన్నారి కూడా బయటకు వచ్చాడు. ఆ చిన్నారి చేతిలో స్పెషల్ కేటగిరీ ప్లకార్డు ఉండడంతో ఒక్కడే విమానం దిగినట్లు అందరికీ అర్ధం అయ్యింది.
తాత డ్రాప్-అమ్మ పికప్:
గత ఫిబ్రవరిలో తాతతో పాటు సెలవులు గడిపేందుకు 5ఏళ్ల విహాన్ శర్మ దిల్లీ కు వెళ్ళాడు. అంతలోగా కరోనా చుట్టు ముట్టడంతో విహాన్ కూడా దిల్లీ లో ఇరుక్కుపోయాడు. మూడు నెలల తర్వాత దేశీయ విమానాలకు అనుమతి దొరకడంతో బెంగళూరుకు వచ్చేందుకు విహాన్ సిద్ధమయ్యాడు. సోమవారం ఉదయం విహాన్ తాత దిల్లీ విమానాశ్రయంలో ఎక్కించగా, సిబ్బంది సాయంతో బెంగళూరుకు చేరుకున్నాడు. విమానం దిగ్గానే అమ్మ కనిపించడంతో విహాన్ ఎగిరి గంతేశాడు. విహాన్ ఎంతైనా గట్టి పిండమే కదా