IMG 20200525 WA0080

క్వారంటైన్ నిబంధనలు ధిక్కరించిన కేంద్ర మంత్రి..!

జనరల్

క్వారంటైన్ నిబంధనలు ధిక్కరించిన కేంద్ర మంత్రి  నేను నిబంధనలకు అతీతుడను- కేంద్ర మంత్రి సదానంద గౌడ

బెంగుళూరు, మే 26:కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనలు విధించింది. సోమవారం ఉదయం దిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన కేంద్ర రసాయన, ఎరువులు, ఔషధాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ నేరుగా తన నివాసానికి వెళ్లారు. ఈ విషయం మాధ్యమాల్లో వైరల్ కావటంతో స్పందించిన సదరు మంత్రి ‘ నేను ప్రస్తుత కరోనా అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ఔషధాలు ఆయా రాష్ట్రాలకు అందేలా చూడాలి. ఏమాత్రం ఆలస్యమైనా సమస్యలు ఎదురవుతాయి. నేను నిబంధలు సడలింపు విభాగానికి చెందిన వాడను’ అంటూ బదులిచ్చారు.
నాకు ఆరోగ్య సేతు యాప్ కూడా ఉంది:
గత 63రోజులుగా దిల్లీలోనే ఉన్నా. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆరోగ్య సేతు యాప్ గ్రీన్ ఫ్లాగ్ కూడా పొందా. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నా. పైగా ప్రత్యేక విమానంలోనే బెంగళూరుకు వచ్చా. నేను నిబంధనలు ఉల్లంఘించలేదే అంటూ మంత్రి ఎదురు ప్రశ్న వేశారు.