800px Vikas Soudha

సచివాలయ ఉద్యోగులూ వర్క్ ఫ్రం హోమ్

జనరల్

సచివాలయ ఉద్యోగులూ వర్క్ ఫ్రం హోమ్
*సిబ్బందికి కరోనా సోకటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో భయం.. భయం

బెంగుళూరు, జూన్ 19: ఇప్పటి వరకు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులే వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులూ ఇదే విధానాన్ని అనుసరించక తప్పలేదు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులూ అందులోనూ సచివాలయ సిబ్బంది కరోనా బారిన పడటంతో వర్క్ ఫ్రం హోం విధానం లోనే విధులు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

క్వారంటైన్ లోకి వికాససౌధ, కృష్ణా:
గత మంగళవారం వికాససౌధ ఉద్యోగిని ఒకరికి కరోనా సోకినట్లు ధ్రువీకరణ అయ్యింది. దీనితో వికాససౌధ ఉద్యోగులంతా ఇంటినుంచే విధులు నిర్వర్తించాలని సచివాలయం అధికారికంగా ఆదేశించింది. ముఖ్యమంత్రి అధికార నివాసం కృష్ణాలో పనిచేసే మహిళా కానిస్టేబుల్ భర్తకు కరోనా సోకినట్లు తేలటంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కృష్ణాలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలన్నీ విధానసభకు బదిలీ చేసారు. ఇక్కడి సిబ్బంది కూడా అవసరం మేరకు వర్క్ ఫ్రం హోం చేయాల్సిందిగా ఆదేశించారు. కృష్ణా కార్యాలయాన్ని శానిటైజ్ చేసేందుకు బీబీఎంపీ సిద్ధమైంది. బెంగళూరు లోని నైరుతి రైల్వే డి ఆర్ ఎం కార్యాలయ స్టేషన్ మాస్టర్ కు కరోనా నిర్ధరణ కావటం, బీఎంటీసీలో పనిచేసే 5గురు సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో నగరంలోని నాలుగు డిపోలు క్వారంటైన్ చేసారు.