టీకా నిర్వహణపై దేశీయ వ్యాక్సిన్ తయారీదారులను కలిసిన – జాతీయ నిపుణుల బృందం
టీకా నిర్వహణపై జాతీయ నిపుణుల బృందం ఈ రోజు ప్రముఖ దేశీయ వ్యాక్సిన్ తయారీదారులైన – సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే; భారత్ బయోటెక్, హైదరాబాద్; జైడస్ కాడిలా, అహ్మదాబాద్; జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్, పూణే; బయోలాజికల్ ఈ, హైదరాబాద్ సంస్థలను కలుసుకుంది.
ఈ సమావేశం పరస్పరం ప్రయోజనకరంగా, ఉత్పత్తిదాయకంగా జరిగింది.
దేశీయ తయారీదారులు అభివృద్ధి చేస్తున్న వివిధ వ్యాక్సిన్ల గురించీ, కేంద్ర ప్రభుత్వం నుండి వారు కోరుకుంటున్న అంచనాల గురించీ వివరాలను, ఈ సమావేశంలో జాతీయ నిపుణుల బృందానికి అందించడం జరిగింది.