49708038208 eff5e48c44 c

ఆదివారం లాక్ డౌన్ ఆదుకొనే నా?

జనరల్

ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ప్రభావం శనివారం సాయంత్రం నుంచే కనిపించింది. రాష్ట్రంలో  మరోమారు లాక్ డౌన్ అమలు చేయటం  చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తోంది.  ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2వేలకు చేరువగా ఉన్నాయి.  పొరుగు రాష్ట్రాల నుంచి పొలోమని వచ్చినవారు అన్ని జిల్లాలో  తిష్ట వేసుకుపోయారు.  వీరిపై నిఘా ఉంచటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న వాదనలు కూడా  వినిపిస్తున్నాయి.  రాష్ట్ర సరిహద్దుల్లో  తనిఖీ బృందాలు మరింత పకడ్బందీగా వ్యవహరించి వలసల్ని కట్టడి చేసి ఉంటే కరోనా ఇంతలా వ్యాపించి ఉండేది కాదన్నది కొట్టి పారేయలేని వాస్తవం.

download 10

లాక్ డౌన్ కన్నా నిఘా నయం :

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారం కార్యకలాపాలు ఊపందుకున్నాయి.  శాఖల వారీగా ఆదాయం పుంజుకున్నట్లు రెవిన్యూ శాఖ మంత్రి ఆర్. అశోక్ వెల్లడించారు.  ఈనేపథ్యంలో  మళ్ళీ లాక్ డౌన్ అమలు చేయటం అర్ధం లేని వ్యవహారమని కాంగ్రెస్ ఎమ్మెల్యే యూటి ఖాదర్ వ్యాఖ్యానించారు.  వలసదారుల పై నిఘా,  వారికి సత్వర పరీక్షలు,  క్వారంటైన్ ప్రక్రియలు సక్రమంగా నిర్వర్తించి ఉంటే రాష్ట్రంలో కేసుల తీవ్రత ఇంతలా వ్యాప్తి చెంది ఉండేది కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఒక్కరోజు లాక్ డౌన్ అమలు చేసి.. మిగిలిన ఆరు రోజులు వెసులుబాటు కల్పిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.