– ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న కిల్లర్ కరోనా వైరస్ కారణంగా ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే వయసు ఆధారంగా కొంత మంది నుంచి మాత్రమే వైరస్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పటికీ వ్యాక్సిన్ కనుగొనలేని పరిస్థితి. రోజులు పెరిగే కొద్ది కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సంక్రమిస్తోంది. ఈ తరుణంలో కరోనా వ్యాప్తి చేస్తున్న క్యారియర్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాప్తికి కారణం ఎవరు .. కరోనాను ఎవరు ఎవరు ఎక్కువగా వ్యాప్తి చెందిస్తున్నారు అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. చిన్న పిల్లలు, వృద్ధుల ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని తేల్చి చెప్పింది. అయితే 20 నుంచి 50 ఏళ్ల లోపు వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతున్నట్లు ప్రకటించింది. కరోనాను నివారించాలంటే యువత మధ్య వయస్కులు అప్రమత్తంగా ఉండాలని అలాగే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా కారణంగా కొంతకాలం పాటు లాక్ డౌన్ కొనసాగినా ప్రస్తుతం అందరూ దైనందిన జీవనంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చాలామంది కరోనా బారిన పడుతున్నారని వివరించారు.