IMG 20200623 WA0084

వైద్య మంత్రి ఇంట్లో కరోనా కలకలం….!

జనరల్

వైద్య మంత్రి ఇంట్లో కరోనా కలకలం:
*తండ్రి, భార్య, కుమార్తెకు కొరోనా:
*కుమారులతో సహా మంత్రి సేఫ్:
బెంగుళూరు, జూన్ 23:
కర్ణాటక వైద్య విద్య శాఖ మంత్రి డా.కె. సుధాకర్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. నిత్యం రాష్ట్రాన్ని కరోనా నుంచి రక్షించే విధానాలు రూపొందించే మంత్రి ఇంటిని కరోనా నుంచి రక్షించుకోవడంలో విఫలం అవటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. సోమవారం తన తండ్రి కి కరోనా నిర్ధారణ కావడంతో మంత్రి అప్రమత్తం అయ్యారు. తండ్రి తనతోనే ఉండటంతో కుటుంబ సభ్యులకు అనివార్యంగా కరోనా టెస్టులు చేయించక తప్పలేదు. మంగళవారం కుటుంబ సభ్యుల నివేదికలు వచ్చాయి.
కరోనా బారిన భార్య, కుమార్తెలు:
మంగళవారం ఆరోగ్య శాఖ వెల్లడించిన నివేదికల్లో మంత్రి భార్య, కుమార్తెకు కరోనా ఉన్నట్లు తేలింది. కానీ మంత్రితో పాటు ఇద్దరు కుమారులకు నెగటివ్ నివేదికలు రావటంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిబంధనల మేరకు మంత్రితో పాటు కుమారులు క్వారంటైన్ కాగా కరోనా సోకిన ఇతర సభ్యులకు కొవిడ్ ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. 82ఏళ్ల మంత్రి తండ్రికి ప్రత్యేక నిఘాతో చికిత్స చేస్తున్నారు. ఇంట్లో సహాయకులుగా ఉన్న వారి నుంచి కరోనా సోకినట్లు మంత్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

IMG 20200623 WA0075