IMG 20200815 WA0019

KRS : నిండు కుండలా కెఆర్ఎస్ డ్యామ్….!

జనరల్

నిండు కుండలా కెఆర్ఎస్ డ్యామ్:
*1933 తర్వాత వరుసగా రెండేళ్ల పాటు గరిష్ట మట్టం
*18న సీఎం వాయన సమర్పణ
బెంగళూరు, ఆగస్టు 15:కన్నడ జీవనాడి, మండ్య జిల్లా నదీమతల్లి కెఆర్ఎస్ డ్యామ్ గరిష్ట నీటి మాట్టాన్ని చేరుకుంది. ఈ డ్యామ్ గరిష్ట నీటి మట్టం 124.80 అడుగులు కాగా ఇప్పటికే 124.05 అడుగుల నీరు చేరింది. నేటితో గరిష్ట మట్టం అందుకోనుంది. 1933 తర్వాత గరిష్ట మట్టం నీరు చేరటం వరుసగా రెండవసారి అని కావేరి జల నిగమ్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది కూడా వందరోజులు క్రమం తప్పకుండా గరిష్ట స్థాయి నీటి మట్టం నమోదుకావటం విశేషం.
18న సీఎం వాయనం:
ఈనెల 18న ముఖ్యమంత్రి యాడియూరప్ప కావేరి నదికి వాయనం సమర్పించనున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పటికే 5సార్లు కావేరి వాయనం సమర్పించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కబిని, కెఆర్ఎస్ డ్యాములు జల కళను సంతరించుకోవటంతో పొరుగు రాష్ట్రాల జల వివాదాలు కూడా సమసి పోనున్నాయి.