IMG 20181025 WA0022

ఏపీలో వలంటీర్‌ వ్యవస్థ బాగుంది

జనరల్

– గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తెచ్చిన వైఎస్ జగన్
– వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్‌ హెమ్మనూరు సుదర్శన్‌శర్మ

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న సంక్షేమ పథకాలు.. వాటి ఫలితాలు.. గ్రామ స్వరాజ్యంతో పాటు గాంధీజీ కలలు కన్న వ్యవస్థలో ప్రతి ఒక్క ఇంటికీ వలంటీర్‌ ద్వారా అందుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు డాక్టర్‌ హెమ్మనూరు సుదర్శన్‌శర్మ అన్నారు. సోమవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరి చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

“the poverty cannot be eradicated by mere distribution of the alumens”

వ్యవసాయానికి పెద్దపీట.. కానీ
సుమారు 80 శాతం పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న మన దేశంలో వ్యవసాయానికి పెద్ద పీట వేయాలన్నారు. అంతేకానీ సంక్షేమమే అనుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని చెప్పారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సర్వతో ముఖంగా నీటి పారుదల ప్రాజెక్టులపై ఇప్పటికే దృష్టి సారించిందన్నారు. అయినా రాజకీయాలకు అతీతంగా రాజకీయ నేతల ప్రమేయం లేకుండా ప్రాంతీయ భేదం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటినీ భర్తీ చేస్తే ప్రతి ఒక్కరికీ పని కల్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఓసీలకు అన్యాయమనే భావన వద్దు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు ప్రధాన వర్గాలకు గానూ నాలుగు (ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ) వర్గాలకు మాత్రమే న్యాయం జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోందన్నారు. ఈనేపథ్యంలో ఓసీలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు బయట ప్రచారం సాగుతోందని.. అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పారని.. అలాంటి తప్పులు చేయకుండా అన్ని రంగాలు, వర్గాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

చెక్‌డ్యాంలతో నీటిని బంధించి..
పూర్వ కాలంలో రాజులు, పాలెగార్లు నీటి ఒరవడి చూసి చెరువులు నిర్మించారన్నారు. కానీ గత ప్రభుత్వాలు నీటిని చెక్‌డ్యాంల ద్వారా బంధించినట్లు చెప్పారు. అయితే వర్షాలు రాక చెక్‌డ్యాంలు నిండక.. చెరువుల్లోకి నీళ్లు లేక ఆయుకట్టు భూములన్నీ బీళ్లుగా మారాయని వాపోయారు.