C202005183500

కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు 2020 జూన్ 1 నుంచి అమలులోకి వచ్చే నూతన మార్గదర్శకాలు..!

జనరల్

కంటైన్ మెంట్ జోన్లో లాక్డౌన్ ఠినంగా అమలు. ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గర్శకాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీటిని గుర్తిస్తాయి.
కంటైన్మెంట్ జోన్ వెలుప అన్ని కార్యలాపాలూ వారీగా ప్రారంభం. అన్లాక్ -1 కు ఆర్ధిక దృష్టి .
అత్యరం కాని అన్ని కార్యలాపాలకు సంబంధించి వ్యక్తుల లిక విషయంలో రాత్రి 9 గంట నుంచి ఉదయం 5 గంట కు రాత్రి ర్ఫ్యూ అమలులో ఉంటుంది.

కోవిడ్ -19 పై పోరాటం సాగించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఈరోజు  విడుద‌ల  చేసింది. వీటి ప్ర‌కారం కంటైన్ మెంట్ జోన్ వెలుప‌ల ఉన్న ప్రాంతాల‌లో కార్య‌క‌లాపాల‌ను ద‌శ‌ల వారీగా ప్రారంభించేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు 2020 జూన్ 1 నుంచి అమ‌లులోకి వ‌స్తాయి. ఇవి 2020 జూన్ 30 వ‌ర‌కు అమ‌లులో ఉంటాయి. ప్ర‌స్తుత ద‌శ కార్య‌క‌లాపాల పునఃప్రారంభానికి ఆర్థిక దృష్టి ఉంటుంది.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌తో విస్తృత స్థాయిలో సంప్ర‌దింపులు జ‌రిపిన అనంత‌రం ఈ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేశారు.
2020 మార్చి 24నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేశారు. అత్య‌వ‌స‌ర కార్య‌క‌లాపాలు మిన‌హా మిగిలిన అన్ని కార్య‌క‌లాపాల‌ను అప్ప‌ట్లో నిషేధించారు.  ఆతర్వాత ,కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టే ల‌క్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ అంచెల వారీగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తూ వ‌చ్చారు.
నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌లోని ముఖ్యాంశాలు:
కంటైన్ మెంట్ జోన్‌ల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా అమ‌లుచేయ‌డం కొన‌సాగుతుంది. వీటిని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు , కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిర్ధారిస్తాయి. కంటైన్‌మెంట్ జోన్ల‌లో ఖ‌చ్చితంగా ఆ ప్రాంత ప‌రిధిని గుర్తించి అక్క‌డి కార్య‌క‌లాపాల‌ను ఖ‌చ్చితంగా నియంత్రిస్తారు. కేవ‌లం అత్యావ‌శ్య‌క కార్య‌క‌లాపాల‌ను మాత్ర‌మే ఆ ప్రాంతంలో అనుమ‌తిస్తారు.
కంటైన్ మెంట్ జోన్ల‌కు వెలుప‌ల ,ఇంతకుముందు నిషేధించిన అన్ని కార్య‌క‌లాపాల‌ను ద‌శ‌ల‌వారీగా తెరుస్తారు. అయితే, ఇందుకు  ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ సూచించిన స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్ (ఎస్‌.ఒ.పిల‌ను)అనుస‌రించాల్సి ఉంటుంది.

ఫేజ్ -1( 2020 జూన్ 8 నుంచి తెర‌వ‌డానికి అనుమ‌తిస్తున్న‌వి)

— మ‌త‌సంబంధ ప్ర‌దేశాలు, ప్రార్థ‌నా స్థ‌లాలలో ప్ర‌జ‌ల‌కు అనుమ‌తి
— హోట‌ళ్ళు, రెస్ట‌రెంట్లు, ఇత‌ర ఆతిథ్య సేవ‌లు,
— షాపింగ్ మాల్స్‌
పై కార్య‌క‌లాపాల‌కు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ,  ఎస్‌.ఒ.పిల‌ను జారీచేస్తుంది. ఇందుకు సంబంధిత‌ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాలు  , ఆయా రంగాల‌తో సంబంధం ఉన్న‌వారిని సంప్ర‌దించి కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు, సామాజిక దూరం పాటించేలా చేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ‌ ఎస్‌.ఒ.పిల‌ను జారీ చేస్తుంది.
ఫేజ్ -2
పాఠ‌శాల‌లు, కాలేజీలు , విద్యాసంస్థ‌లు, శిక్ష‌ణ , కోచింగ్ కేంద్రాలు త‌దిత‌రాల‌ను రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల‌తో సంప్ర‌దించిన మీద‌ట ప్రారంభించ‌డం జ‌రుగుతుంది. రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల పాల‌నాయంత్రాంగాలకు, ఆయా సంస్థ‌ల స్థాయిలో త‌ల్లిదండ్రులు, ఇత‌ర స్టేక్ హోల్డ‌ర్ల‌తో సంప్ర‌దించాల్సిందిగా సూచించ‌డం జ‌రిగింది. వారి నుంచి వ‌చ్చే ప్ర‌తిస్పంద‌న‌ ఆధారంగా  ఈ సంస్థ‌ల‌ను తెరిచే అంశంపై 2020 జూలైలో నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌ ఈ సంస్థ‌ల‌కు ఎస్‌.ఒ.పిల‌ను రూపొందిస్తుంది.

దేశవ్యాప్తంగా రిమిత సంఖ్యలో కార్యలాపాల నిషేధం కొనసాగింపు:

— అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణికులు,
–మెట్రోరైలు సేవ‌ల నిర్వ‌హ‌ణ‌
–సినిమాహాళ్ళు, జిమ్నాజియ‌మ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేట‌ర్లు, బార్లు, ఆడిటోరియంలు, స‌మావేశ మందిరాలు, ఇలాంటి ఇత‌ర ప్రాంతాలు
–సామాజిక‌, రాజ‌కీయ‌, క్రీడా, వినోద‌, విద్యా, సాంస్కృతిక‌, మ‌త సంబంధ ఫంక్ష‌న్లు,  పెద్ద సంఖ్య‌లో జ‌నం ఒక చోట చేరేందుకువీలున్న‌ఇత‌ర కార్య‌క‌లాపాలు,
— పై కార్య‌కలాపాల ప్రారంభానికి సంబంధించి, ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన పిద‌ప‌, ఫేజ్ -3 లో నిర్ణ‌యించ‌డం జ‌రుగుతుంది.

ఎలాంటి రిమితులు లేకుండా కులు, వ్యక్తుల లికకు అనుమతి:
–ఒక రాష్ట్రం నుంచి, మ‌రో రాష్ట్రానికి వెళ్ల‌డానికి, లేదా రాష్ట్రంలోప‌ల వ్య‌క్తుల ప్ర‌యాణానికి, లేదా స‌ర‌కుల ర‌వాణాకు ఎలాంటి ఆంక్ష‌లు లేవు. ఇలాంటి ప్ర‌యాణాల‌కు, స‌ర‌కు త‌ర‌లింపున‌కు ప్ర‌త్యేకంగా అనుమ‌తులు కానీ, ఈ- ప‌ర్మిట్‌లుకానీ అవ‌స‌రం లేదు.
అయితే ప్ర‌జా రోగ్యం దృష్ట్యా ఏదైనా రాష్ట్రం లేదా కేంద్ర‌పాలిత ప్రాంతం త‌గిన కార‌ణాల‌తో , ప‌రిస్థితిని అంచ‌నా వేసేన అనంత‌రం వ్య‌క్తుల క‌ద‌లిక‌ల‌ను నియంత్రించ‌ద‌లిస్తే అందుకు సంబంధించి ముందుగా అలాంటి ఆంక్ష‌ల‌ వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు విస్తృతంగా తెలిసేలా ప్రచారం చేప‌ట్టాలి. ఇందుకు సంబంధించిన‌ ప్ర‌క్రియ‌ను పాటించాలి.
రాత్రి క‌ర్ఫ్యూ : వ‌్య‌క్తుల క‌ద‌లిక‌, అత్య‌వ‌స‌రం కాని కార్య‌క‌లాపాల‌కు సంబంధించి రాత్రిపూట క‌ర్ఫ్యూ య‌ధావిధిగా కొన‌సాగుతుంది. అయితే స‌వ‌రించిన  క‌ర్ఫ్యూ వేళ‌లు రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల‌వ‌ర‌కు అమ‌లులో ఉంటాయి.
కోవిడ్ -19 వ్యాప్తి నిరోధానికి సంబంధించి సామాజిక దూరం పాటించేలా చూసేందుకు, జాతీయ స్థాయి ఆదేశాలు దేశ‌వ్యాప్తంగా  కొన‌సాగుతాయి.
కంటైన్‌మెంట్ జోన్ల వెలుప‌ల కార్య‌క‌లాపాల‌పై నిర్ణ‌యం తీసుకోనున్న రాష్ట్రాలు:
రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు త‌మ త‌మ ప్రాంతాల‌లో ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన మీద‌ట కంటైన్‌మెంట్ జోన్ల వెలుప‌ల కొన్ని ర‌కాల కార్య‌క‌లాపాల‌ను నిషేధించ‌వ‌చ్చు. లేదా అవ‌స‌ర‌మ‌నుకున్న ఆంక్ష‌ల‌ను విధించ‌వ‌చ్చు.
వైరస్ బారినడే అవకాశం ఉన్న వ్యక్తులకు క్ష‌:

వైర‌స్ బారిన‌ప‌డే అవ‌కాశం ఉన్న వ్య‌క్తులు, అంటే 65 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారు, ఇత‌ర ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు , గ‌ర్భిణులు, 10 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌లు వీరిని అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప లేదా ఆరోగ్య అవ‌స‌రాల‌కు త‌ప్ప ఇళ్ళ‌లోనే ఉండాల్సిందిగా సూచించ‌డం జ‌రిగింది.

ఆరోగ్య సేతు వినియోగం:
కోవిడ్ -19 వైర‌స్ బారిన ప‌డిన వారిని స‌త్వరం గుర్తించేందుకు, లేదా వైర‌స్ బారిన ప‌డే రిస్క్ ను తెలియ‌జేసేందుకు భార‌త ప్ర‌భుత్వం రూపొందించిన శ‌క్తిమంత‌మైన ఉప‌క‌ర‌ణం, ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేష‌న్‌. ఇది వ్య‌క్తుల‌కు , క‌మ్యూనిటీకి ర‌క్షా క‌వ‌చంగా ప‌నికివ‌స్తుంది. కోవిడ్ -19 వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ‌కు పూచీప‌డేందుకు ఈ మొబైల్ అప్లికేష‌న్ వినియోగాన్ని ప్రోత్స‌హించాల్సిందిగా వివిధ అథారిటీల‌కు సూచించ‌డం జ‌రిగింది.