IMG 20200815 WA0021

S P B : బాలు బాగు కోసం ప్రార్థనలు

FILM NEWS సినిమా

బాలు బాగు కోసం ప్రార్థనలు:

*టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల ట్వీట్ల వెల్లువ

*కృత్రిమ శ్వాస పైనే గాన సామ్రాట్

బెంగళూరు ఆగస్టు 15: దక్షిణ భారత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని టాలివుడ్, కోలీవుడ్ ప్రముఖులు గెట్ వెల్ సూన్ పేరిట హ్యాష్ ట్యాగ్ లతో ప్రార్థిస్తున్నారు. ఈనెల 5న కరోనా లక్షణాలతో చికిత్స ప్రారంభించిన బాలు శుక్రవారం ఐసీయూలో చేరారు. చెన్నయ్ లోన ఎంజిఎం హెల్త్ కేర్ ఆస్పత్రిలో ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉన్నట్లు ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధ భాస్కరన్ వెల్లడించారు.

ఇళయరాజా నుంచి తమన్ దాకా:

స్వర చక్రవర్తి ఇళయరాజా మొదలుకుని యువ సంగీత దర్శకుడు తమన్ దాకా బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవలి కాలంలో బాలు, ఇళయరాజా ల మధ్య అభిప్రాయ భేదాలున్న విషయం తెలిసిందే. వాటిని పక్కన బెట్టిన ఇళయరాజా బాలు కోలుకుని రావాలన్నారు. బాలుకోసం కొత్త స్వరాలు రచించినట్లు తమన్ ట్వీట్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్, అనిరుద్ రవిచందర్, కిచ్చ సుదీప్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కోన వెంకట్, విక్రమ్ ప్రభు, బండ్ల గణేష్ తదితరులు బాలు కోలుకోవాలని ట్వీట్ చేశారు