– బెంగళూరులో కరోనా కేసుల అప్‌డేట్
బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో కరోనా వాయువేగంతో వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు 80 వేల మందికి పైగా సోకినట్లు నిర్ధారించారు. అయితే కోవిడ్ కంట్రోల్ రూం నిపుణుల అంచనా ప్రకారం బెంగళూరులో ప్రతి 100 మందిలో 20 మందికి కరోనా సోకింది. నేటి (ఆగస్టు 15) నుంచి కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. నగర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల సంఖ్య 181కు పెరిగింది. ఫలితంగా కేసుల సంఖ్య రెట్టింపు కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా సగటున రోజుకు 20 వేల మందికి పరీక్షలు చేయగా.. రెండు వేల కేసులు వచ్చేవి. ప్రతి 100 మందిలో 18 – 20 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. అయితే పరీక్షల సంఖ్య పెరిగితే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.