ఆంధ్రకు విమానాల్లో వెళ్లొచ్చు:
రెండు నెలల విరామం తర్వాత విమానాల్లో విశాఖకు
దిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ ల నుంచి విమానాలకు అనుమతి
బెంగుళూరు, మే 26: మార్చి 23నుంచి నిలిచిపోయిన దేశీయ విమాన సేవలు సోమవారం నుంచే పునః ప్రారంభమయ్యాయి. కానీ ప్రయాణీకుల విషయంలో అనుసరించాల్సిన నిబంధనల్లో స్పష్టత లేక ఆంధ్రప్రదేశ్ కు విమాన ప్రయాణాలు అనుమతించలేదు. కానీ సోమవారం నావిక, ఇమిగ్రేషన్, రాష్ట్ర పోలీసు, వైమానిక ప్రాధికార, వైద్య అధికారులు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో నాలుగు దేశీయ సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది.
క్వారంటైన్ తప్పనిసరి
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దిల్లీ, ముంబయి, చెన్నయి, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వారం రోజుల పాటు ఇన్టిట్యూషనల్ క్వారంటైన్ కు వెళ్ళక తప్పదు. వారం రోజుల తర్వాత వీరికి నెగటివ్ నివేదికలొస్తే హోం క్వారంటైన్ కు అబిమతి ఇస్తారు. పాసిటివ్ తేలితే ఆస్పత్రులకు తరలిస్తారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి థెర్మల్ స్క్రీనింగ్ తో పాటు శ్వాబ్ ను తీసుకుని ఇంటికి పంపుతారు. ఆధునిక సాంకేతిక విధానాలతో పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశారు
మంగళవారం ఉదయం 6:55గంటలకు బెంగుళూరు నుంచి, 7గంటలకు దిల్లీ నుంచి, ఉదయం 11:50 గంటలకు హైదరాబాద్ ల నుంచి ఇండిగో విమానాలు, రాత్రి 9గంటలకు బెంగుళూరు నుంచి ఎయిర్ ఏసియా విమానం రానుంది. ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థలు జోడిస్తూ విమాన సేవలు దశల వారీగా పెంచుతామని విశాఖ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.