ramyakrishna13062020 c c82

రమ్యకృష్ణ కారులో మద్యం సీసాలు

జనరల్

రమ్యకృష్ణ కారులో మద్యం సీసాలు

బెంగుళూరు, జూన్ 13:బహుభాషా నటి, ‘బాహుబలి’శివగామి రమ్యకృష్ణ కారులో లీటర్ల కొద్దీ మద్యం సీసాలున్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై ఈసీఆర్ రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు 103 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రమ్యకృష్ణ పేరుతో రిజిస్టర్ అయిన ఈ కారులో తనిఖీ వేళ ఆమె డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. ఈ కారును గుర్తించిన ప్రాంతం కంటైన్మెంట్ జోన్ లో ఉండటం గమనార్హం. టొయోటా కిర్లోస్కర్ సంస్థకు చెందిన ఇన్నోవా క్రిష్టా కారు నంబర్ TN 07 CQ 0099గా నమోదయ్యింది. ఈ తనిఖీలో 97 బీరు సీసాలు, 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ సెల్వకుమార్(38)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పై స్పందించని రమ్యకృష్ణ గంటల వ్యవధిలో పోలీసు స్టేషన్ కు వచ్చి తన డ్రైవర్ కు జామీను ఇచ్చి విడిపించారు. మహాబలిపురం నుంచి ఈ మద్యం సీసాలు తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణ లో తేలింది