బెంగళూరు నగరంలోని డీజే హళ్లి – కేజీ హళ్లి ఘటనలో భాగంగా అరెస్టయిన 40 మంది నిందితులకు ఉగ్రవాదులతో లింక్ ఉన్నట్లు సమాచారం. ఫేస్‌బుక్‌లో అవహేళన పోస్టు ఆధారంగా హింసాత్మక చర్యలు చేపట్టిన అల్లరిమూకలు.. అసలు స్కెచ్ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. అల్లర్లు సృష్టించే సమయంలో గంటల వ్యవధిలోనే వేల మందిని ఒకచోటుకు పోగు చేశారు. అదే సమయంలో వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ గుర్తించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఒకరికొకరు చేరి పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టడం.. ఒక్కోచోట 10 మంది గుంపుగా ఉండి అల్లర్లు చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో సీసీబీ తనిఖీలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అరెస్టయిన వారి కంటే మంగళవారం పట్టుకున్న వాజిద్, తౌసిఫ్, ఫాజిల్, అఫ్జల్ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
విచారణలో వస్తున్న అనుమానాలు
– మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయం, చర్చి వీధిలో బాంబు పేలుళ్లు, ఆర్‌ఎస్‌ఎస్ నేత రుద్రేశ్ హత్యలో భాగమైన వారితో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
– బెంగళూరుతో పాటు దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్‌లు, షాపింగ్ మాళ్లు, జనావాస ప్రాంతాల్లో పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు అనుమానిస్తున్నారు.
– ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న చాలా మంది ఇంతకుముందు ఉగ్రవాదులతో కలిసినట్లు సమాచారం.
– అల్లర్లలో సుమారు 4000 వేల మంది పాల్గొనాల్సిన అవసరం ఏముంది? అయితే అయిన వారిలో చాలామంది రాళ్లు రువ్విన వారు ఉన్నారు. కానీ నిప్పు పెట్టిన వారు పరారీ అయినట్లు తెలిసింది.
– సామాన్య ప్రజల ఆస్తికి నష్టం కలిగించిన వారెవరనేది విచారణలో తేలాల్సి ఉంది. పోలీసు వ్యవస్థను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే వాహనాలకు నిప్పు పెట్టారు.
– వాజిద్, తౌసిఫ్, ఫాజిల్, అఫ్జల్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 10 మందికి గానూ నలుగురిని అరెస్టు చేయగా.. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు.