1 0

బెంగళూరులో హింసాత్మక ఘటన…!

జనరల్

బెంగళూరులో హింసాత్మక ఘటన…!

బెంగళూరులో 144 సెక్షన్‌

బెంగళూరు: ఫేస్‌బుక్‌ తెచ్చిన తంటా అర్ధరాత్రి 2 గంటల వరకు గొడవకు దారి తీసింది. పోలీసులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఘటనలో 60 మంది పోలీసులు గాయపడ్డారు. మరో 110 మందిని అరెస్టు చేశారు. ఫలితంగా బెంగళూరు నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించినట్లు పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌ తెలిపారు. వివరాలు.. బెంగళూరులోని పులకేశినగర ఎమ్మెల్యే (కాంగ్రెస్‌) అఖండ శ్రీనివాసమూర్తి అనుచరుడు నవీన్‌ ముస్లిం సముదాయానికి విరుద్ధంగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో ముస్లిం సముదాయానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కావళిభైరసంద్రలో ఉన్న ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడికి దిగారు. పరిస్థితిని

IMG 20200812 101821

అదుపులోకి తేవాలని పోలీసులు వచ్చి..చెదరగొట్టగా.. వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. అదేవిధంగా 60 మంది పోలీసులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకుంటున్న పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే గలాటకు ముందే ఎమ్మెల్యే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. పోలీసులకు చెందిన సుమారు 50 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. ఉన్నత స్థాయి పోలీసు అధికారుల కార్లన్నిటికీ నిప్పు పెట్టారు.

బెంగళూరులో 144 సెక్షన్‌

IMG 20200812 101813
కేజీ హళ్లి, డీజే హళ్లి ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ స్థాయిలో గలాట జరగడంతో బెంగళూరు నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ జారీ చేయాలని రాష్ట్ర హోం మంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అదేవిధంగా గొడవ జరిగిన డీజే హళ్లి, కేజీ హళ్లి ప్రాంతాల్లో కర్ఫ్యూ జారీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా గొడవకు కారణమైన వారిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పసిగట్టాలని సూచించారు. డీజే హళ్లి పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పోలీసులకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మంత్రులు బసవరాజు బొమ్మై, ఆర్‌.అశోక్, పోలీసు అధికారులు ప్రవీణ్‌ సూద్, కమల్‌పంత్‌తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.