కోవిడ్ -19: తొలి సంచార ఐ-లాబ్ ప్రారంభించిన మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
కోవిడ్ నుంచి కోలుకున్నవారు 52.96% కు పెరుగుదల.
మారు మూల ప్రాంతాల్లో సైతం కోవిడ్ పరీక్షలు జరపగలిగేలా భారత దేశపు తొలి సంచార ఐ-లాబ్ ( అంటువ్యాధుల నిర్థారణ పరిశోధనశాల) ము కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రారంభించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేని చోట్ల దీన్ని వాడతారు. దీని సాయంతో రోజుకు 25 కోవిడ్ పరీక్షలు చేయవచ్చు. అదే విధంగా రోజుకు 300 ఎలీసా పరీక్షలు, అదనంగా టీబీ, హెచ్ ఐ వి లాంటి పరీక్షలు కూడా చేయవచ్చు. సిజి హెచ్ ఎస్ ధరలకే ఇది సాధ్యమవుతుంది. కోవిడ్ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఈ లాబ్ కు శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ వారి బయోటెక్నాలజీ విభాగం సహకరిస్తోంది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 7,390 మంది కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,94,324 కు చేరింది. బాధితులలో కోలుకున్నవారి శాతం 52.96% గా నమోదైంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,60,384 . వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
కరోనా వైరస్ సోకిన వారిని పరీక్షించేందుకు పరీక్షల సామర్థ్యాన్ని భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) పెంచుతూ వస్తోంది. ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు 699 కి చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 254 కి పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 953 అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 540 (ప్రభుత్వ: 349 + ప్రైవేట్: 191)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 340 (ప్రభుత్వ: 325 + ప్రైవేట్: 15)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 73 (ప్రభుత్వ: 25 + ప్రైవేట్: 48)
గడిచిన 24 గంటల్లో 1,65,412 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 62,49,668 కు చేరింది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే [email protected] కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు [email protected] మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి.